భీమా మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ అప్‌‌‌‌డేట్

భీమా మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ అప్‌‌‌‌డేట్

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమా’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గోపీచంద్‌‌‌‌ లుక్స్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా గోపీచంద్ నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌కు సంబంధించి బుధవారం మేకర్స్‌‌‌‌ అప్‌‌‌‌డేట్ ఇచ్చారు. 

జనవరి 5న టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో గోపీచంద్‌‌‌‌ ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించాడు. ఇందులో గోపీచంద్‌‌‌‌కు జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు.  ‘సలార్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. అజ్జు మహంకాళి డైలాగ్స్ రాస్తున్నాడు.