ఎట్టకేలకు OTTలోకి వస్తున్న రామబాణం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఎట్టకేలకు OTTలోకి వస్తున్న రామబాణం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్(Gopichand) ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయాతి(Dimple Hayati) జంటగా వచ్చిన మూవీ రామబాణం. టాలెంటెడ్ దర్శకుడు శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. జగరపతిబాబు(Jagapathi), ఖుష్బూ(Kushbu) వంటి స్టార్ నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ల‌క్ష్యం(Lakshyam), లౌక్యం(Loukyam) వంటి హిట్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్‌ హిట్ అవుతుందని అందరూ భావించారు కానీ.. సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన మొదటి షో నుండే నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను చూడటానికి ఆడియన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.   

ALSO READ : చంద్రయాన్ 4లో నిన్ను పంపుతా : ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం

మే 5న రామబాణం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలై నెలలు గడుస్తున్నా ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. నిజానికి ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమా కోసం చాల రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రామబాణం టీమ్ గుడ్ న్యూస్‌ చెప్పింది. సెప్టెంబరు 14 నుండి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్డేట్ తో గోపీచంద్ ఫ్యాన్స్  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి మరి.