గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న 33వ సినిమా ఇది. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో యోధుడిలా గోపీచంద్ కనిపించనున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు.
