సీఎం కేసీఆర్ ను తరిమికొట్టే టైం వచ్చింది

సీఎం కేసీఆర్ ను తరిమికొట్టే టైం వచ్చింది

పాపన్నపేట/మెదక్, వెలుగు: అన్య మతస్తుడిని ఏడుపాయల దేవాలయ కమిటీ మెంబర్​గా ఎలా నియమిస్తారని గోషామహల్​ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్​ప్రశ్నించారు. ఆదివారం ఆయన మెదక్​జిల్లా ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏడుపాయల పవిత్రమైన హిందూ దేవాలయమన్నారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన పాలకమండలి డైరెక్టర్లలో కావాలని క్రిస్టియన్​వ్యక్తికి అవకాశం కల్పించిందని, ఆయననే చైర్మన్​చేయాలని చూస్తోందన్నారు. హిందూ దేవాలయ కమిటీల్లో అందరూ హిందువులే డైరెక్టర్లుగా, చైర్మన్లు గా ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఎండోమెంట్​ మినిస్టర్​ ఏడుపాయలకు వచ్చి ఇక్కడ పరిస్థితి పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

కేసీఆర్​ను తరిమికొట్టే టైం వచ్చింది

టీఆర్ఎస్​ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, సీఎం కేసీఆర్ ను తరిమికొట్టే టైం వచ్చిందని రాజాసింగ్​ అన్నారు. ఆదివారం మెదక్ లో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు తరిమి కొడతారనే విషయం అర్థమై కేసీఆర్​ఇప్పటి నుంచే రాష్ట్రం బయట ఉండటం అలవాటు చేసుకుంటున్నారని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి పనుల కోసం లక్షల కోట్ల ఫండ్​ వస్తోందని రాజాసింగ్ చెప్పారు. రాష్ట్రంలో నేషనల్ హైవేలు, ఫోర్​లైన్​రోడ్ల నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఫండ్స్​ వస్తుండగా.. సీఎం కేసీఆర్​కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి, కేంద్రం మీద యుద్ధం చేస్తానంటున్నారని మండిపడ్డారు. బీజేపీ మీద సోషల్​మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలపై లీడర్లు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు గట్టిగా కౌంటర్​ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుధాకర్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జి మల్లారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్​బాలయ్య తదితరులు పాల్గొన్నారు.