
డీజీపీ అంజనీ కుమార్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనకు 8 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని డీజీపీని కోరారు. రక్షణ కోసం పదేపదే కోరుతున్నా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తనపై కేసులున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పోలీస్ శాఖ.. కేసులున్న ఎవ్వరికీ లైసెన్స్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. తనకు పాకిస్థాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ తన లేఖలో తెలిపారు.