
సెల్ ఫోన్ లేకుండా రోజు గడవదు అనేకంటే క్షణం గడవదు అనటం బెటరేమో. అంత అడిక్షన్ తీసుకొచ్చింది ఈ డివైజ్. ఎక్కడికి వెళ్లినా జేబులో పెట్టుకుని వెళ్లటం కామన్.ఈ ఇన్సిడెంట్ చూస్తే జేబులో పెట్టుకోవాలంటే భయపడక తప్పదు.
ఆదిలాబాద్ జిల్లాలో జేబులోసెల్ఫోన్ పేలి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం (జులై 15) గంగాధర్ అనే యువకుడు జాందాపూర్ ఎక్స్ రోడ్డు దగ్గర బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపేయింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్రమైన గాయాలయ్యాయి.
గంగాధర్ తల్లితో కలిసి ప్రయాణిస్తుండగా.. సెల్ ఫోన్ పేలటం కలకలం రేపింది. అంతకు ముందు ఫోన్ మాట్లాడి బైక్ పై వెళ్తున్నందున ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకున్నాడు గంగాధర్. మార్గ మధ్యలో జంధాపూర్ దగ్గర ఉన్నట్లుండి పేలిపోవడంతో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తొడ పై భాగంలో చర్మం అంతా కొట్టుకుపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోన్ రెండు పచ్చలయ్యి.. బ్యాటరీ నల్లగా కమిలి పోయింది.