
హైదరాబాద్ లో నీళ్ల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్న ఇంటి ఓనర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాటర్ బోర్డు. నగరంలో సకాలంలో వానలు కురవక.. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగావాటర్ ట్యాంకర్ బుకింగ్ లు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది వాటర్ బోర్డు.
గ్రేటర్ పరిధిలో 300 గజాలకు ఎక్కువగా ఉన్న ప్రతీ ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలంటున్న జలమండలి సూచించింది. ఇంకుడు గుంత లేకుండా ట్యాంకర్ బుక్ చేసుకున్న వారికి ట్యాంకర్ల రేట్లు పెంచుతామని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితుల్లో.. భవిష్యత్తులో భూగర్భ జలాలను పెంచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లో గతేడాది జులై తో పోలిస్తే ఈ జులై లో 36 శాతంట్యాంకర్ బుకింగ్ లు పెరిగాయి. గత ఏడాది జులై 1 నుంచి 14 తేదీ వరకు 63 వేల724 ట్యాంకర్లు బుకింగ్ చేసుకుంటే.. ఈసారి 86 వేల520 ట్యాంకర్లు బుకింగ్అయినట్లు అధికారులు తెలిపారు. అంటే దాదాపు 33 వేలకు పైగా ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జలమండలి పరిధిలో దాదాపు 1,135 ట్యాంకర్లు ఉన్నాయని.. ఇంకుడు గుంతలు లేకుంటే ధరలు పెంచుతామని హెచ్చరించారు.