Non-veg milk: అమెరికాతో భారత్ తగ్గేదేలే.. కారణం ఎందుకు అంటే ?

Non-veg milk: అమెరికాతో భారత్ తగ్గేదేలే.. కారణం ఎందుకు అంటే ?

భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే, జంతువుల భాగాలు అంటే మాంసం లేదా రక్తం వంటి తినని ఆవుల నుండి పాలు దిగుమతి చేసుకునేల కఠినమైన సర్టిఫికేషన్ ఉండాలని  భారతదేశం పట్టుబడుతోంది. మతపరమైన,  సాంస్కృతిక కారణాల వల్ల  భారతదేశం పాల వినియోగదారులను రక్షించుకోవడానికి దీనిపై చర్చించడానికి వీలు లేదని భావిస్తోంది.

అయితే 2030 నాటికి రెండు దేశాల వాణిజ్యాన్ని 50 వేల కోట్లకి పెంచాలన్న లక్ష్యంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై  మొదలైన ఈ చర్చలు కొన్ని కీలక కారణాల వల్ల ఆగిపోయాయి. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న పాల ఉత్పత్తులు మాంసం లేదా రక్తం వంటి జంతు ఆధారిత మాంసం, రక్తం వంటివి తినని ఆవుల నుండి వచ్చేల భారతదేశం ఒక కఠినమైన సర్టిఫికేషన్  కోరడం ఇందుకు ముఖ్య  కారణం.

జంతు పదార్ధాలు, మాంసం, రక్తం అందిస్తూ ఒక ఆవు పాలతో తయారు చేసిన వెన్న లేదా నెయ్యిని భారతదేశం ఎప్పటికీ అనుమతించదు అని న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (GTRI)కి చెందిన అజయ్ శ్రీవాస్తవ అన్నారు. భారతదేశంలో ఆవు పాలు కేవలం వినియోగం కోసం మాత్రమే కాకుండా పాల ఉత్పత్తులు ఇంకా ప్రతిరోజు మతపరమైన ఆచారాలలో కూడా ముఖ్యమైన భాగం. 

అయితే అమెరికా ఈ విషయాన్నీ తేలికగా  తీసుకుంటుంది. ప్రపంచంలోనే ప్రముఖ పాల ఉత్పత్తిదారి అయిన భారతదేశం, లక్షలాది మంది చిన్న పాడి రైతులను రక్షించడానికి దృఢంగా నిలుస్తుంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం, భారతదేశం డైరీ పరిశ్రమ 140 కోట్లకు పైగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తోంది ఇంకా 8 కోట్లకు పైగా ప్రజలకు, ముఖ్యంగా చిన్న రైతుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.

ప్రస్తుతం భారతదేశం జున్నుపై 30%, వెన్నపై 40%, పాలపొడిపై 60% అధిక సుంకాలను విధిస్తోంది, దీనివల్ల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి తక్కువ ఖర్చుతో, ఉత్పత్తిదారుల నుండి కూడా దిగుమతులు సాధ్యం కాదు.  భారతదేశంలో ఎక్కువగా శాకాహారులు కూడా ఉన్నారు. వీరు జంతువుల భాగాలు లేదా మాంసం వంటి ఆహారంగా తీసుకున్న ఆవుల పాల ఉత్పత్తులను మతపరమైన నమ్మకాలకు విరుద్ధంగా భావిస్తారు. భారతీయ ప్రజల సాంస్కృతిక, ఆహార ప్రాధాన్యతలు దీనికి ప్రధాన కారణం. 

అంతేకాకుండా భారతదేశంలోని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ ఆహార దిగుమతులకు పశువైద్య ధృవీకరణ(veterinary certification) తప్పనిసరి చేసింది. దీని ప్రకారం, దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులు జంతువుల విడి భాగాలు లేదా మాంసం ఆహారంగా తినని  ఆవుల నుండి రావాలని నిబంధన ఉంది. అమెరికా ఈ నిబంధనను ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో విమర్శించింది.

ALSO READ : చిరునవ్వుతో బయటకు వచ్చిన శుక్లా.. డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి మెడికల్ చెకప్స్కు క్రూ టీం


అమెరికా గత సంవత్సరం $8.22 బిలియన్ల పాల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారి, వినియోగదారి అయిన భారతదేశంలోకి అమెరికా పాల ఉత్పత్తులను విస్తరించడానికి ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుతం $16.8 బిలియన్ల విలువైన భారతదేశ డైరీ పరిశ్రమ, ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు (239 మిలియన్ మెట్రిక్ టన్నులు) వాటాతో ఉంది. ఇంకా లక్షల మందికి జీవనోపాధిని అందిస్తుంది.  

అమెరికా పాల ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్‌లోకి  రావడం వల్ల తక్కువ ధరకు పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. దింతో  దేశీయ ధరలు తగ్గి చిన్న రైతులను ఆర్థికంగా  దెబ్బతీస్తుందని ఆందోళనలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు భారతదేశం పాల ఉత్పత్తుల మార్కెట్‌లోకి అమెరికాకు రానిస్తే  ఏటా రూ. 1.03 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఎస్‌బీఐ విశ్లేషణ అంచనా వేసింది.

భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డైరీ పరిశ్రమ కీలకమైనది. ఇది జాతీయ స్థూల విలువ ఆధారిత (GVA)కి సుమారు 2.5-3% వాటా అంటే  సుమారు రూ. 7.5-9 లక్షల కోట్లు అందిస్తుంది. GVA అంటే వస్తువులు, సేవల మొత్తం విలువ నుండి ముడి పదార్థాల ఖర్చును తీసివేసిన తర్వాత మిగిలేది.

"పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు లేదా కుక్కల భాగాలను ఆవులు తినడానికి ఇప్పటికీ అనుమతి ఉంది. పశువులు ప్రోటీన్ కోసం పంది, గుర్రపు రక్తాన్ని తినడం కొనసాగించవచ్చు, అలాగే పశువుల భాగాల నుండి వచ్చే కొవ్వును (ట్రాలో) కూడా ఉపయోగించవచ్చు. పశువుల మేతలో ప్రతిరోజు జంతువుల భాగాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పౌల్ట్రీ వ్యర్థాలు కూడా  ఉపయోగిస్తారు" అని తేలింది. 

USRT నేషనల్ ట్రేడ్ ఎస్టిమేట్ (NTE) ప్రకారం, జంతువుల భాగాలను ఆహారంగా తీసుకునే ఆవుల నుండి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంపై భారతదేశం నిషేధాన్ని గట్టిగా కొనసాగిస్తోంది.