మేం నిప్పులం.. ప్రతి ఒక్కరినీ కాల్చేస్తాం..వైరల్ అవుతున్న నేపాల్ విద్యార్థి వీడియో

 మేం నిప్పులం.. ప్రతి ఒక్కరినీ కాల్చేస్తాం..వైరల్ అవుతున్న నేపాల్ విద్యార్థి వీడియో

నేపాల్‌లో కొనసాగుతున్న జనరల్ జెడ్ నిరసనతో రాజకీయ ఉద్రిక్తతల మధ్య అల్లకల్లోలంగా మారిన క్రమంలో ఓ స్కూల్ బాయ్ రెవెల్యూటరీ స్పీచ్ కు సంబంధించిన పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 

ఆ స్కూల్ విద్యార్థి తన పాఠశాల వార్షిక కార్యక్రమంలో ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ప్రసంగంలో దేశంలో యువత పతనం గురించి, నిరుద్యోగం ,ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతి గురించి కూడా మాట్లాడారు.తన ఉద్వేగభరితమైన ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న అవినీతి సమస్యలకు కారణమైన ప్రతి ఒక్కరినీ యువత తగలబెట్టాలని కూడా ఆ విద్యార్థి చెప్పడం గమనార్హం. 

ఈ వీడియో నేపాల్‌లోని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంది.. అక్కడ యువత ప్రభుత్వంతో పోరాడటానికి తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిరసనను కూడా 'జనరల్ జెడ్ నిరసన' అని పిలుస్తున్నారు. కారణం.ఇందులో యువత ప్రధానంగా పాల్గొనడమే. 

నేపాల్.. మన తల్లి..ఈ దేశం మనకు జన్మనిచ్చింది..మనల్ని పోషించింది... కానీ అది ప్రతిఫలంగా ఏమి కోరింది? మన నిజాయితీ, మన కృషి, మన సహకారం మాత్రమే. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం నిరుద్యోగ గొలుసులతో బంధించబడి అవకాశాల కోసం విదేశాలకు పారిపోతున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలలో చిక్కుకున్నాం. యువతరమా..లేవండి..మనం మన గొంతులను పెంచకపోతే ఇలాగే ఉంటుంది.. అంటూ ఆ విద్యార్థి స్పీచ్ కు గూస్ బంప్స్ రాకమానదు. 

►ALSO READ | మాజీ ప్రధాని భార్యను తగలబెట్టి చంపేసిన ఆందోళనకారులు : అసలు ఏం జరుగుతుందయ్యా అక్కడ..!

మేం చీకటిని తగలబెట్టే అగ్నిలం.. అన్యాయాన్ని తుడిచిపెట్టి శ్రేయస్సును తెచ్చే తుఫాను మేం.."నేపాల్ మనది ,దాని భవిష్యత్తు మన చేతుల్లో ఉంది.జై యువ, జై నేపాల్. అంటూ ఆ విద్యార్థి ప్రసంగాన్ని ముగించారు. 

రెండురోజులుగా నేపాల్ లో ఉద్రిక్తత క్రమంలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అతని ప్రసంగానికి నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉందని అంటున్నారు.. నేపాల్ లో రాజకీయ నేతల అవినీతి , నిరుద్యోగమే విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేలా ప్రేరేపించి ఉండొచ్చని భావిస్తున్నారు.