Kiran Abbavaram : 'కలలే కలలే..' ‌రొమాంటిక్ సాంగ్‍తో ఆకట్టుకున్న 'కె-ర్యాంప్'.

Kiran Abbavaram :  'కలలే కలలే..' ‌రొమాంటిక్ సాంగ్‍తో ఆకట్టుకున్న 'కె-ర్యాంప్'.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.  జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కె -ర్యాంప్'.  ఈ మూవీలో  బాలీవుడ్ నటి యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి 'కలలే కలలే..' అనే రొమాంటిక్ సాంగ్ విడుదలైంది.  ఈ సాంగ్  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  భాస్కరభట్ల రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ తన మధురమైన స్వరంతో ఆలపించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.  పాటలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా మధ్య కెమిస్ట్రీ, విజువల్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పక్కా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కిరణ్ అబ్బవరం గత చిత్రాల మాదిరిగానే, ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 'కె-ర్యాంప్' తో కిరణ్ తన విజయాల పరంపరను కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానున్న ఇతర పెద్ద సినిమాలతో పోటీ పడనుండటంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది.