చిరునవ్వుతో బయటకు వచ్చిన శుక్లా.. డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి మెడికల్ చెకప్స్కు క్రూ టీం

చిరునవ్వుతో బయటకు వచ్చిన శుక్లా.. డ్రాగన్ క్యాప్సూల్స్ నుంచి మెడికల్ చెకప్స్కు క్రూ టీం

18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాంశు శుక్లా టీం భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియా తీరంలో స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ఒక్కొక్కరుగా క్రూ మెంబర్లను బయటకు తీసుకొచ్చారు స్పేస్ ఎక్స్ టీం. ముందుగా కమాండర్ పెగ్గీ విట్సన్ ను బయటకు తీసుకొచ్చారు. స్పేస్ ఎక్స్ టీమ్ చేతులు పట్టుకుని ఆమెను మెడికల్ చెకప్స్ కు తీసుకెళ్లారు.

ఆ తర్వాత క్రూ గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లాను బయటకు తీసుకొచ్చారు స్పేస్ ఎక్స్ సభ్యులు. బయట కాలుమోపిన శుక్లా చిరునవ్వుతో అభివాదం చేశాడు. సిబ్బంది సహకారంతో మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఇనిషియల్ చెకప్స్ కు వెళ్లాడు. 

ALSO READ : 18 రోజుల.. 97 లక్షల కిలోమీటర్లు.. 230 సూర్యోదయాలు: శుభాంశు శుక్లా టీమ్ యాత్ర విశేషాలు

మొత్తం 20 రోజుల తర్వాత శుక్లా టీం గ్రావిటీని (భూమ్యాకర్షణ శక్తిని) చూస్తోంది. పెగ్గీ విట్సన్, శుక్లా తర్వాత మిగతా క్రూ మెంబర్లను కిందికి దించారు. అందరినీ ఇనిషియల్ మెడికల్ చెకప్స్ కోసం పంపించారు. 

జులై 14న అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన డ్రాగన్ స్పేస్ షిప్.. మంగళవారం(జులై 15) మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా సముద్రంలో డ్రాగన్ క్యాప్సూల్స్ ల్యాండింగ్ అయ్యింది. ఫసిఫిక్ మహాసముద్రంలో జరిగిన స్ప్లాష్ డౌన్ స్పాట్ లో క్రూ మెంబర్లను బయటకు తీసుకొచ్చేందుకు కాస్త ఆలస్యం జరిగింది. 

 స్ప్లాష్ డౌన్ స్పాట్  డ్రాగన్ క్యాప్సూల్స్ దిగిన వెంటనే కెమికల్ స్ప్రే చేశారు. డ్రాగన్ క్యాప్సూల్స్ హాచ్  ఓపెన్ చేసిన  స్పేస్ ఎక్స్ క్రూ.. రికవరీ షిప్ నుంచి ఆస్ట్రోనాట్స్ వచ్చిన వెంటనే మెడికల్ టీమ్ ఇనిషియల్ చెకప్స్ కోసం క్రూ మెంబర్లను తరలించారు. 

ఈ సందర్భంగా  స్ప్లాష్ డౌన్ విజయవంతం అయినందుకు  నవ్వుతూ అభివాదం తెలిపాడు శుక్లా.