
భూమిని వదిలి.. చంద్రున్ని దాటి.. భూమి లాంటి గ్రహాలను.. చంద్రుళ్లను ఎన్నో దాటుతూ.. తోకచుక్కలు, గ్రహశకలాలను చూస్తూ అంతరిక్ష యానం చేసిన శుభాంశు శుక్లా టీం ప్రయాణం ఒక అద్భుతం, అద్వితీయం. ప్రపంచంలో ఇలాంటి అవకాశం అరుదుగా.. కొందరికి మాత్రమే వస్తుంది. ఆ కొందరిలో ఒక్కడైన శుక్లా.. రాకేశ్ శర్మ తర్వాత భారత్ నుంచి అంతరిక్ష యానం చేసిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా శుభాంశు టీం ప్రయాణ విశేషాలను గురించి తెలుసుకుందాం.
జూన్ 25న అంతరిక్ష యాత్రకు బయల్దేరిన క్రూ మెంబర్లలో శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కపు కూడా ఉన్నారు. వీళ్లు మొత్తం18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గ డిపారు. భూమి నుంచి అంతరిక్ష కేంద్రం (ISS) వరకు మొత్తం 96.5 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేశారు.
ప్రయాణం చేస్తుండగా.. అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో నుంచి మొత్తం 230 సూర్యోదయాలను వీక్షించారు. అంటే మనకు ఉన్న సూర్యుడు లాంటి 230 నక్షత్రాలను వీళ్లు చూశారన్నమాట. మన విశ్వంలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. మన సౌరకుటుంబాన్ని దాటి శుభాంశు టీం.. మరెన్నో సౌరకుటుంబాలను చూస్తూ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంది.
అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ వంటి ప్రయోగాలు చేశారు శుభాంశు టీమ్. డయాబెటిక్ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు మొదలైన పరిశోధనలు నిర్వహించారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల ఆరోగ్యంపై పరిశోధనలు చేశారు దీనివలన అంతరిక్షకలో ఉన్న వారి డయాబెటిక్, క్యాన్సర్ వంటి రోగాలపై పరిశోధన చేసేందుకు మార్గం సుగమం అయినట్లు చెబుతున్నారు.