ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది.. అధికార ఎన్డీయే కూటమి తరపు సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 9) సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసింది.. ఇదే సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 

మంగళవారం(సెప్టెంబర్9) సాయంత్రం5 గంటలకు 96 శాతం మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం పార్లమెంట్ భవనం లోపల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది.లోక్‌సభ,రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. 

ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. బ్యాలెట్ రహస్య ఓటు ద్వారా జరుగుతుంది.లెక్కింపు పూర్తయిన తర్వాత సాయంత్రం తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. 

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది.ప్రధానిమోదీ మొదటి ఓటు వేశారు. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహించే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు పార్టీ విప్‌లకు కట్టుబడి ఉండరు.

ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ,కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు రెండూ తమ ఎంపీలతో ఈ ప్రక్రియ గురించి వారికి వివరించడానికి సమావేశాలు నిర్వహించి మాక్ పోల్స్ నిర్వహించాయి. ఎంపీలు ఇద్దరు అభ్యర్థుల జాబితాతో కూడిన బ్యాలెట్ పత్రాలను అందుకుంటారు. వారు ఎంచుకున్న అభ్యర్థి పేరు పక్కన "1" అనే అంకెను వ్రాయడం ద్వారా వారి ప్రాధాన్యతను గుర్తించాలి. 

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది సభ్యులు ఉన్నారు. - రాజ్యసభ నుండి 245 మంది ,లోక్‌సభ నుండి 543 మంది,12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు సహా ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ సీట్లు, ఒక లోక్‌సభ సీటుతో ప్రస్తుత ఎంపీల సంఖ్య 781గా ఉంది. దీనితో మెజారిటీ సంఖ్య 391గా ఉంది. 

NDAకి 425 మంది ఎంపీలు ఉండగా, ప్రతిపక్ష కూటమికి 324 మంది ఉన్నారు. ఈ కూటమి వెలుపల ఉన్న పార్టీలలో 11 మంది ఎంపీలతో ఉన్న YSR కాంగ్రెస్ పార్టీ NDA అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి.BRS ,BJD ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.