
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై 152 మెజారిటీతో సీపీ రాధాకృష్ణ గెలుపొందారు.
వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మొత్తం 781 ఓట్లకు గానూ 767 ఓట్లు పోలయ్యాయి. 14 మంది గైర్హాజరయ్యారు. ఎన్నికల్లో 15 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్ మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు.
►ALSO READ | భారత ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టం.. అమెరికా తెస్తున్న హైర్ యాక్ట్ 2025 ప్రభావం ఎంత..?
ఉపరాష్ట్రపతి ఎన్నికకు అధికార ఎన్డీయే కూటమి తరపు సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది... సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది.
98.2 శాతం మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం పార్లమెంట్ భవనం లోపల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది.లోక్‌సభ,రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభ నుండి 245 మంది ,లోక్‌సభ నుంచి 543 మంది,12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు సహా ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ సీట్లు, ఒక లోక్‌సభ సీటుతో ప్రస్తుత ఎంపీల సంఖ్య 781గా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 391గా ఉండగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు పోలయ్యాయి.