
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ చేస్తున్నారో మనందరికి తెలుసు..అంతేకాదు వింత వింత పద్దతుల్లో కూడా చేస్తున్నారు. పెళ్లి చూపులు మొదలు, పెళ్లి అయిపోయేవరకు తమదైన శైలీలో ఎల్లకాలం గుర్తిండాలి అని తెగ ఫీలవుతూ రకరకాల కొత్త పద్దతుల్లో పెళ్లిళ్లు చేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, పోటోషూట్ తో వింత పోకడలు పోతున్నారు. ఇక పెళ్లి విందులో మద్యం, ముక్క లేనిదే అది పెళ్లే కాదు అన్నట్లు భావిస్తున్నారు. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు యువత పిచ్చి పనులు చేసి నవ్వులపాలవుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ గ్రామం ఏకంగా సాదాసీదాగా మద్యం మాంసం లేకుండా పెళ్లి జరిపేందుకు సిద్దమయ్యారు. ఆకధా కమామిషు ఏంటో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని సంగమేశ్వర్ తాలూకాలోని దేవ్డే గ్రామం ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖరీదైన పెళ్లిళ్లకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. స్థానిక గ్రామస్తులు, ముంబై నివాసితులు,మహిళా మండల్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హల్దీ కార్యక్రమాలలో మద్యం అందించే పద్ధతిని వెంటనే నిలిపివేయడం ఖరాఖండి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పెళ్లి వేడుకలకు గ్రామస్తులు హాజరు కాకూడదని హుకుం జారీ చేశారు.
అంతేకాదు.. పెళ్లిళ్లలో ప్రస్తుతం వింత పోకడలకు చెక్ పెట్టాలని కూడా అనుకున్నారు. పెళ్లిళ్లలో చాలా ఆచారాలను నిషేధించారు. మహారాష్ట్రలో పెళ్లిళ్లలో నిర్వహించే ఘర్ బాగ్నీ కార్యక్రమంలో తిండి ఖర్చు ఎక్కువగా ఉందని వెంటనే రద్దు చేశారు. పెళ్లికి ముందు రోజు హల్లీ వేడుకల్లో మద్యం, మాంసాహారం వంటకాలు పూర్తిగా నిషేధించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే గ్రామస్తులు వివాహ వేడుకలో పాల్గొనకుండా నిషేధించారు.
వారెవ్వా మంచి పని చేశారు..లేకపోతే ఈ వింతపోకడలేంటీ.. అధిక ఖర్చులు ఏంటీ.. సాదాసీదాగా పెళ్లి చేసుకుంటే అది పెళ్లి కాదా..అదనంగా భారం ఎందుకు అని.. ఈ వార్త విన్నవారంతా ముంబై వాళ్లు మంచిపనిచేశారు అని అనుకుంటున్నారు.