
కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరి శిక్ష అమలు చివరి నిమిషంలో వాయిదా పడింది. హత్య కేసులో యెమెన్ దేశంలోని జైలు ఉన్న భారతీయ నర్సు నిమిషా ప్రియకు అక్కడి కోర్టు ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవటానికి బ్లడ్ మనీ కింద బాధిత కుటుంబానికి డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో క్లారిటీ రాకపోవటంతో.. జూలై 16వ తేదీ శిక్ష అమలు చేయటానికి యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉరి శిక్ష అమలు చేయటానికి.. ఉరి కంభం ఎక్కటానికి అంతా సిద్ధం అయిన సమయంలో.. ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
ALSO READ : 114యేళ్ల వెటరన్ మారథాన్..రోడ్డు ప్రమాదంలో మృతి..ప్రధాని దిగ్భ్రాంతి
బాధిత కుటుంబంతో..నర్సు ప్రియ తరపు లాయర్ చర్చలు విజయవంతం అయ్యాయి. బ్లడ్ మనీ కింద 11 కోట్ల రూపాయలకు బాధిత కుటుంబం ఓకే చెప్పింది. దీంతో ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. డబ్బు చెల్లింపునకు సమయం కోరారు నర్సు ప్రియ తరపు లాయర్. ఈ డీల్ ఫైనల్ అయిన తర్వాత.. ఇద్దరు వ్యక్తులు అంగీకారానికి వచ్చిన తర్వాత నర్సు ప్రియ ఉరిశిక్షను రద్దు చేసి..మామూలు శిక్షను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. యెమెన్ దేశంలో ఉన్న చట్టాల విషయంలో భారతదేశానికి ఎలాంటి ఒప్పందాలు లేకపోవటంతో.. కేంద్ర ప్రభుత్వం సైతం జోక్యం చేసుకోలేకపోయింది.
నర్సు ప్రియ చేతిలో హత్యకు గురైన బాధితుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో చర్చలు జరిపారు ఆమె తరపు లాయర్ సుభాష్ చంద్రన్. అబ్దో మహదీ సోదరుడు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నాడని.. బ్లడ్ మనీతోపాటు క్షమాపణలకు ఓకే చెప్పినట్లు సమాచారం. 11 కోట్ల రూపాయల బ్లడ్ మనీ ఇవ్వటానికి సిద్ధంగా ఉందని.. ఈ నిధులను రహీం ట్రస్ట్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్నామని బాధిత కుటుంబంతో జరిపిన చర్చల్లో అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉరి శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది అక్కడి ప్రభుత్వం.
అయితే బుధవారం (జూలై16) నిమిష ప్రియ ఉరిశిక్ష అమలు కానున్న క్రమంలో భారత మీడియా ఈ కేసుకు సంబంధించిన పెద్ద ఎత్తున కవరేజీ చేసింది. హౌతీలు ఆమెకు ఉరిశిక్ష అమలు చేయొద్దని మానవ హక్కుల సంఘాలు పిలుపునిచ్చాయి.