114యేళ్ల వెటరన్ మారథాన్..రోడ్డు ప్రమాదంలో మృతి..ప్రధాని దిగ్భ్రాంతి

114యేళ్ల వెటరన్ మారథాన్..రోడ్డు ప్రమాదంలో మృతి..ప్రధాని దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: పంజాబ్ కు చెందిన ప్రముఖ మారథాన్ ఫౌజా సింగ్ మృతిపట్ల ప్రధాని మోదీ మంగళవారం (జూలై 15) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వెటరన్ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

114యేళ్ల వయసులో కూడా ఫౌజాసింగ్ ఫిట్ నెస్, ప్రత్యేక వ్యక్తిత్వం గల వెటరన్ మారథాన్ యువతకు ఆదర్శనం అన్నారు ప్రధాని మోదీ.  సింగ్ అద్భుతమైన దృఢ సంకల్పం కలిగిన అసాధారణమైన అథ్లెట్ అని ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫాం X లో రాశారు. 

114 ఏళ్ల సింగ్ సోమవారం పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని తన స్వగ్రామంలో వాకింగ్ కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.దీంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే మృతిచెందారు.ఫౌజాసింగ్ తన 100 ఏళ్ల వయసులో కూడా అంతర్జాతీయ మారథాన్‌లలో రికార్డులను బద్దలు కొట్టాడు .

పూర్తి ఫిట్‌నెస్ ,ఆరోగ్యంతో జీవించిన ఫౌజా సింగ్ నేటి యువతకు ఆదర్శంగా నిలించారు. 114 యేళ్ల వయస్సులో  ఫిట్‌నెస్‌ను సవాల్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయే సింగ్‌ను టర్బన్డ్ టోర్నడో అని పిలుస్తారు.

►ALSO READ | వృద్ధాశ్రమంలో మంటలు..తొమ్మిది మంది మృతి

'సిక్కు సూపర్‌మ్యాన్' గా పిలువబడే ఫౌజా సింగ్..2000 సంవత్సరంలో లండన్ మారథాన్‌లో జరిగిన మారథాన్‌లోకి 89 సంవత్సరాల వయసులో అడుగుపెట్టారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించాడు. 

ఫౌజాసింగ్ టొరంటో , న్యూయార్క్ ,ఇతర నగరాల్లో పరిగెత్తాడు.వివిధ మారాథాన్ ఫార్మాట్లలో రేసును పూర్తి చేసి అతిపెద్ద వయసు మారథానర్ అయ్యాడు. అతని విజయాలు వయస్సు,శారీరక సామర్థ్యం వంటి సవాలు చేశాయి.