
- అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం
ఫాల్ రివర్: అమెరికాలోని ఓ వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 9 మంది చనిపోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. చాలామంది వృద్ధులు లోపల చిక్కుకున్నారు. కిటికీల నుంచి వేలాడుతూ సహాయం కోసం అర్థిస్తున్నారు. ఆదివారం రాత్రి మసాచుసెట్స్ లోని ఫాల్ రివర్ లో ఉన్న గాబ్రియేల్ హౌస్ వృద్ధాశ్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో భవనం ముందు భాగంలో భారీ స్థాయిలో మంటలు, పొగ చెలరేగాయి. సమాచారం అందుకున్న 50 మంది అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. సోమవారం ఉదయం నాటికి మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం లోపలికి వెళ్లి పలువురిని రక్షించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.