రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..?: పిటీషనర్ను ప్రశ్నించిన హైకోర్టు

రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..?: పిటీషనర్ను ప్రశ్నించిన హైకోర్టు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పిటిషన్ స్వీకరించేందుకు ముంబై హైకోర్టు తిరస్కరించింది. హిందుత్వ లీడర్ వీర్ సావార్కర్ పై  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వేసిన పిటీషన్ ను మంగళవారం (జులై 15) కోర్టు తిరస్కరించింది. 

రాహుల్ గాంధీ బాధ్యతాయుతమైన స్టేట్ మెంట్స్ చేశారని.. చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభినవ్ భారత్ కాంగ్రెస్ ఫౌండర్ కుముదచంద్ర ఫడ్నిస్ పటీషన్ వేశాడు. సావార్కర్ పై కామెంట్స్ం చేస్తూ ప్రజలలో కన్ఫూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించాడు. 

దీనిపై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సందీప్ మార్నే లతో కూడిన ధర్మాసనం.. పిటిషన్ స్వీకరణకు విముఖత చూపింది. మీ పిటిషన్ చదవాలని.. సావార్కర్ గురించి చదువుకోవాలని చెప్పాలని మీరు పిటిషన్ వేశారు.. దీనిపై ఎలా ఆదేశించగలం.. అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 

దీనికి రిప్లై ఇస్తూ.. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత. ఇప్పుడే ఇలా కన్ఫూజన్ క్రియేట్ చేస్తున్నారంటే.. ప్రధానమంత్రి అయితే చాలా విధ్వంసం సృష్టిస్తారని..  అందుకే పిటీషన్  స్వీకరించాలని కోరాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం..  రాహుల్ పీఎం అవుతారని మాకు తెలియదు.. మీకు తెలుసా ప్రధానమంత్రి అవుతారని..? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటీషనర్ కావాలంటే లీగల్ గా డిఫమేషన్ కేసు వేసుకోవచ్చునని సూచించింది.