తాకట్టుతో రుణమిస్తే..వాహనంపై యాజమాన్య హక్కులుండవు : హైకోర్టు

తాకట్టుతో రుణమిస్తే..వాహనంపై యాజమాన్య హక్కులుండవు : హైకోర్టు
  • నల్ల బెల్లం అక్రమ రవాణా కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: తాకట్టుతో వెహికల్ పై రుణం ఇచ్చినంతమాత్రాన దానిపై యాజమాన్య హక్కులు ఉండవని హైకోర్టు తెలిపింది. కేవలం తాకట్టు హక్కులు మాత్రమే ఉంటాయని చెప్పింది. నల్లబెల్లం అక్రమ రవాణా కేసులో ఎన్‌‌డీపీఎస్ చట్టం కింద సీజ్ చేసిన బొలెరో వాహనాన్ని విడుదల చేయాలని కోరుతూ టైగర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తమ సంస్థ ఓ వాహనాన్ని తాకట్టుగా పెట్టుకుని రుణం ఇచ్చిందని టైగర్ క్యాపిటల్ తరఫు అడ్వకేట్ వాదించారు. అయితే, నల్లబెల్లం అక్రమ రవాణా కేసులో ఎక్సైజ్ పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడం వల్ల నష్టపోయామని తెలిపారు. ఈ వాదనను కోర్టు తిరస్కరించింది.