
చిన్న పిల్లల బయోమెట్రిక్ అప్ డేట్ పై కీలక సూచనలు జారీ చేసింది UIDAI. ఏడేళ్లు, ఆపై వయసున్న పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ తప్పనిసరిగా చేయించాలని తెలిపింది సంస్థ. ఏడేళ్లు పూర్తైన పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ చేయని పిల్లలకు తల్లిదండ్రులు, సంరక్షకులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్ డేట్ చేయించాలని ఓ ప్రకటనలో కోరింది UIDAI.
ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వేలి ముద్రలు, ఐరిస్ స్కాన్ లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ.
ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్ డేట్ చేయించాలని.. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితంగా చేయించుకునే వీలు ఉందని తెలిపింది మంత్రిత్వ శాఖ. 7 సంవత్సరాల వయసు తర్వాత కూడా బయోమెట్రిక్ అప్ డేట్ చేయించకపోతే.. ప్రస్తుత రూల్స్ ప్రకారం ఆధార్ నంబర్ దేయాక్టివేట్ చేసే వీలుందని తెలిపింది. ఈమేరకు పిల్లల ఆధార్ నంబర్ కి లింక్ చేసిన మొబైల్ నంబర్ కి మెసేజ్ లు పంపింది మంత్రిత్వ శాఖ.