
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆరోగ్య ఖర్చుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి సత్వరమే ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మందమర్రి ఎంపీడీవో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్‌కు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేశారు. అనంతరం మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలోని ఎస్సీ వాడలో ఏర్పాటుచేసిన బోరు పంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు.
అనంతరం మందమర్రిలోని బి-1 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో చేపట్టిన పనులను పరిశీలించారు. కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజనీ బర్త్‌డే వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎంపీపీ గుర్రం మంగా శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ రాజ్‌కుమార్, జడ్పీటీసీ రవి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, మందమర్రి మున్సిపల్కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
వేతనాలు పెంచాలని నాలుగు రోజులుగా మందమర్రి ఏరియా కేకే ఓసీపీలో సమ్మె చేస్తున్న ఆర్వీఆర్ కాంట్రాక్ట్ డ్రైవర్లు వివేక్‌వెంకటస్వామిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి సమస్యపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.