
ఉగ్రవాద నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్చ ఇస్తామన్నారు. NIA కేసులకు కాంగ్రెస్ మతం రంగు పులుముతుందని ఆయన విమర్శించారు. యాంటీ టెర్రర్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న అమిత్ షా.. విపక్షాల ఆరోపణలకు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పాలనలో దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేశాయో. ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో దేశ ప్రజలందరికి తెలుసున్నారు అమిత్ షా.