తెలంగాణ బెస్ట్ టీచర్స్ 120 మంది

తెలంగాణ బెస్ట్ టీచర్స్ 120 మంది
  • అవార్డులు ప్రకటించిన విద్యాశాఖ 
  • నేడు శిల్పారామంలో టీచర్స్ డే వేడుకలు 
  • హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సర్కారు ప్రకటించింది. 2024–25 ఏడాదికిగానూ 120 మందిని ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. వీరందరికీ శుక్రవారం మాదాపూర్​లోని శిల్పారామంలో జరిగే టీచర్స్ డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను అందించనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 49 మందిని ఎంపిక చేయగా, యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలకు చెందిన 56 మందికి, ఇంటర్మీడియెట్​ విద్యావిభాగంలో 11 మంది, సాంకేతిక విద్యాశాఖ నుంచి నలుగురిని ఎంపిక చేస్తున్నట్టు వేర్వేరు జీవోలు రిలీజ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 161 టీచర్ల ప్రతిపాదనలురాగా.. వారిలో 49 మందిని ఎంపిక చేశారు. దీంట్లో జీహెచ్ఎం, ప్రిన్సిపాల్స్ 10 మంది, స్కూల్ అసిస్టెంట్/పీడీ/ ఎల్​ఎఫ్​ఎల్ కేటగిరీలో 21 మంది, ఎస్జీటీ/పీఈటీలు 12 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఎయిడెడ్ స్కూళ్ల నుంచి ముగ్గురికి, మోడల్ స్కూళ్ల నుంచి ఇద్దరికి, కేజీబీవీ నుంచి ఒకరికి అవార్డులు లభించాయి.  హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోని యూనివర్సిటీల్లోని  ప్రొఫెసర్లకు 34 మంది, అనుబంధ కాలేజీల్లోని లెక్చరర్లకు 22 మందికి అవార్డులు ప్రకటించారు. నలుగురు పాలిటెక్నిక్ లెక్చరర్లకు, సర్కారు జూనియర్ కాలేజీల్లోని నలుగురు ప్రిన్సిపాల్స్​కు, ఏడుగురు లెక్చరర్స్​కు అవార్డులు వచ్చాయి.  

శిల్పారామంలో టీచర్స్ డే వేడుకలు

రాష్ట్రంలో టీచర్స్ డే వేడుకలు శుక్రవారం  మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే  కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అవుతున్నారు. ప్రతిసారి రవీంద్రభారతిలో ఈ వేడుకలు నిర్వహించేవారు. తొలిసారిగా వేదికను మార్చారు. కాగా, సీఎం చేతుల మీదుగా బెస్టు టీచర్స్ అవార్డులు పొందిన వారికి సన్మానం చేయనున్నారు. 


హెచ్ఎం/ప్రిన్సిపాల్ కేటగిరీలో.. 

    సీహెచ్ శంకర్ (జెడ్పీహెచ్ఎస్ బోర్గావ్, నిజామాబాద్ జిల్లా)
    పి. నిర్మల జ్యోతి (జెడ్పీహెచ్ఎస్ మర్యాల, యాదాద్రి భువనగిరి) 
    అరవింద్ కుమార్ (జెడ్పీహెచ్ఎస్ పొంకుల్, నిర్మల్ జిల్లా)
    ఎ. విద్యాసాగర్  (జెడ్పీహెచ్ఎస్ పోతిరేడ్డిపల్లి, సంగారెడ్డి)
    పనుగోతు చత్రు (జెడ్పీహెచ్ఎస్ గరిడేపల్లి, సూర్యపేట) 
    బి. రమేశ్ (జెడ్పీహెచ్ఎస్ మజీద్ పల్లి, సిద్దిపేట జిల్లా) 
    డి. రామ్ రెడ్డి  (జెడ్పీహెచ్ఎస్ నర్కుడ, రంగారెడ్డి జిల్లా) 
    పి. రేఖ  (జీజీహెచ్ఎస్​ మెదక్)
    గడ్డం శశికళ (జెడ్పీహెచ్ఎస్ పిప్పర్వాడ, ఆదిలాబాద్ జిల్లా)
    ఎన్. తారా సింగ్(టీజీఆర్ స్కూల్, మెదక్)
    బెస్ట్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్స్ 
    పి. నాగచందర్ రావు(చెన్నూరు కాలేజీ)
    ఎన్. శంకర్ (తాండూరు) 
    జి. రవిందర్ (భేల్) 
    ఎన్. సత్య ప్రకాష్ (మణుగూరు)
    పాలిటెక్నిక్ కాలేజీల్లో..
    బి. రాజగోపాల్ (సిరిసిల్లా కాలేజీ, ప్రిన్సిపాల్) 
    నల్లి సూర్యకుమారి (హైదరాబాద్ )
    వి. రామకృష్ణ (సిద్దిపేట) 
    సురేశ్ మండిపడి (పెబ్బైర్)