ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు

విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతమున్న 2,934 మద్యం దుకాణాల అనుమతిని మరో ఏడాది వరకు పొడిగించాలని నిర్ణయించింది. మద్యం దుకాణాల తగ్గింపుపై కొత్త పాలసిలో ప్రస్తావించింది ప్రభుత్వం. ఏటా 20 శాతం మేర మద్యం దుకాణాలు తగ్గిస్తామని గతంలో నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తర్వాత 13 శాతం మద్యం దుకాణాలు తగ్గించింది ప్రభుత్వం.

ప్రస్తుత పాలసిలో తగ్గింపు ప్రస్తావన లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్-అలిపిరి మార్గంలో మద్యం దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతి నిరాకరించింది. తిరుపతి బస్టాండ్, లీలామహాల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన 2,934 దుకాణాల పరిధికి లోబడే లిక్కర్ మాల్స్ ఉంటాయని ప్రకటించింది ప్రభుత్వం.