తప్పులు మళ్ల రావొద్దు.. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలె

తప్పులు మళ్ల రావొద్దు.. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలె
  • అడ్మిషన్ నుంచి రిజల్ట్స్ వరకూ రెగ్యులర్ క్యాలెండర్
  • టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్​పై సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు:  టెన్త్, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహణలో నిరుడు జరిగిన తప్పులు మళ్లా జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ చీఫ్​సెక్రటరీ సోమేశ్ కుమార్​ అధికారులను ఆదేశించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. సోమవారం బీఆర్కే భవన్లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై  అధికారులతో సీఎస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నియమించిన త్రీమెంబర్ కమిటీ సూచనలను అధ్యయనం చేసి, పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఎవాల్యూయేటర్లకు గతేడాది తప్పులపై అవగాహన కల్పించాలని, ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకుండా చూడాలని సూచించారు. స్టూడెంట్స్ సౌకర్యం కోసం ఆన్​లైన్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభించాలని, జిల్లాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అడ్మిషన్ నుంచి రిజల్ట్స్ విడుదల వరకు రెగ్యులర్ క్యాలెండర్ ను రూపొందించాలన్నారు. సీజీజీ రూపొందించిన ఐటీ మాడ్యూళ్లను టెస్టు చేసి, తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుండి మార్చి 23 వరకు, టెన్త్ పరీక్షలు మార్చి19 నుండి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయని చెప్పారు.

సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్, సీజీజీ డైరెక్టర్ జనరల్​రాజేంద్ర నిమ్జే, టీఎస్ టెక్నాలజికల్ మేనెజింగ్ డైరెక్టర్ జీటీ వేంకటేశ్వర్ రావు, ఎస్సెస్సీ బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Government Chief Secretary Somesh Kumar instructs officials to conduct Tenth and Inter exams strictly