సర్కారు కాలేజీ జాగల్లో మైనారిటీ గురుకులాలు

సర్కారు కాలేజీ జాగల్లో మైనారిటీ గురుకులాలు
  • పర్మిషన్​ ఇచ్చిన ఇంటర్​ కమిషనరేట్​
  • 3 కాలేజీల స్థలాల్లో ఏర్పాటుకు ఎన్వోసీ
  • 9 స్థలాలు ఇవ్వాలంటూ మైనారిటీ వెల్ఫేర్​ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల జాగాల్లో మైనారిటీ గురుకులాల ఏర్పాటుకు ఇంటర్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ ఓకే చెప్పింది. సిటీలోని మూడు కాలేజీలకు ఉన్న స్థలాల్లో గురుకులాలు పెట్టుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ ఇచ్చింది. మరికొన్నింటిని ఇచ్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది. దీంతో ఆయా కాలేజీల లెక్చరర్లు, స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. రకరకాల కారణాలు చెప్పి కాలేజీల జాగాలు తీసుకున్నారని, ఇప్పుడు మైనారిటీ గురుకులాల ఏర్పాటు కోసం మళ్లీ స్థలాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వక్ఫ్‌‌‌‌‌‌‌‌ బోర్డుకు సంబంధించిన స్థలాలు, సర్కారు జాగాల్లో వాటిని పెట్టుకోవాలని చెబుతున్నారు.  

అడిగిందే తడవుగా కేటాయింపు
సిటీలోని అన్ని సర్కారు జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు స్థలాలున్నాయి. వాటిలో చాలా స్థలాలు కబ్జా అవ్వగా..  కొన్ని స్థలాల్లో ఇప్పటికే స్కూళ్లు, డిగ్రీ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పుడు మైనారిటీ గురుకులాల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వడానికి ఇంటర్​ కమిషనరేట్ రెడీ అయింది. సిటీలో ఉన్న తొమ్మిది ఇంటర్​కాలేజీల పరిధిలో ఉన్న జాగాలు ఇవ్వాలని బోర్డు కమిషనర్​ఉమర్​జలీల్‌‌‌‌‌‌‌‌కు మైనారిటీ వెల్ఫేర్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఇటు హైదరాబాద్​ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు కూడా స్థలాలు కేటాయించాలని రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.  దీంతో నాంపల్లిలోని గర్ల్స్​జూనియర్​ కాలేజీ స్థలంలో మైనారిటీ గర్ల్స్​కాలేజీ, హాస్టల్, ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా బాయ్స్​కాలేజీ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్ కాలేజీతో పాటు హాస్టల్, బజార్​ఘాట్​బాయ్స్​జూనియర్​కాలేజీ జాగాలో మైనారిటీ గర్ల్స్​జూనియర్​కాలేజ్, హాస్టల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసేందుకు ఇంటర్​కమిషనర్​అంగీకరించారు. దానికి సంబంధించి నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్ (ఎన్‌‌‌‌‌‌‌‌వోసీ)ని మైనారిటీ వెల్ఫేర్​డైరెక్టర్​షహనాజ్​ఖాసిమ్‌‌‌‌‌‌‌‌కు పంపారు. దీంతో ఆయా స్థలాల్లో మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయడానికి మైనారిటీ శాఖ సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ప్లాన్‌‌‌‌‌‌‌‌లు కూడా రెడీ చేసినట్టు చెబుతున్నారు. వాటితోపాటు చంచల్‌‌‌‌‌‌‌‌గూడ, కాచిగూడ, మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లి, ఉస్సేని ఆలం, సిటీ కాలేజీతో పాటు తదితర కళాశాలలకు చెందిన జాగాలను కూడా ఇవ్వడానికి ఇంటర్​కమిషనరేట్​ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మైనారిటీ గురుకులాల ఏర్పాటుకు అనుమతిచ్చిన ఇంటర్​కాలేజీల్లో ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్లు చదువుతున్నారు. ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా కాలేజీలో 4,500 మంది ఉన్నారు. ఇక నాంపల్లి బాయ్స్​కాలేజీ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే రెండు జూనియర్​ కాలేజీలు, హైస్కూల్‌‌‌‌‌‌‌‌తో పాటు డిగ్రీ, పీజీ కాలేజీల్లోసుమారు అయిదు వేల మంది స్టూడెంట్లు ఉన్నారు. బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కాలేజీలో  ఉదయం, సాయంత్రం క్లాసులు జరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్లు చదువుతున్న కాలేజీలకు ఉన్న జాగాల్లో వేరే కాలేజీల ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.