స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు

స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు

హైదరాబాద్, వెలుగు: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి దివగంత నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫ్లై ఓవర్​గా పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.450 కోట్లతో 2.63 కి.మీ పొడవుతో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన దివంగత నేత నాయిని నరసింహారెడ్డి పేరును ఈ ఫ్లై ఓవర్​కు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.