
తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రభుత్వం గుర్తు పెట్టుకోలేదని ఫైర్ అయ్యారు కోదండరాం, మందకృష్ణ , ఎల్.రమణ. జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, T TDP అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పద్మశాలి నేతలు హాజరయ్యారు.
లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేసుకున్న నేతలు ట్యాంక్ బండ్ పై కొండ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ వదులుకుని పద్మశాలీలకు కేటాయించాలన్నారు మందకృష్ణ.