కాళేశ్వరం నీళ్లను స్టోర్ చేయడంలో ప్రభుత్వం విఫలం

కాళేశ్వరం నీళ్లను స్టోర్ చేయడంలో ప్రభుత్వం విఫలం

కాళేశ్వరం నీళ్లను స్టోర్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కడెం ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లికి 15 TMCలను తరలించారన్నారు.కాళేశ్వరం నుండి రోజుకు 2 TMC లు తరలించాల్సి ఉందని… దీని ప్రకారం ఆగస్టు1 నుండి ఇప్పటికి 90TMC లు తరలించాలి. అయితే ఇప్పటి వరకు ఎన్ని తరలించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.

Lmd లో 24 రెండింటిలో కలిపి 50 TMC లు నీటి నిల్వ ఉంచవచ్చు.  Lmd 12 TMC లు ..మిడ్ మానేరు 8 TMC లు ఉన్నాయన్నారు. రెండింటిలో కలిపి మొత్తం 20 TMCల నీళ్లు ఉన్నాయి. ఇంకా 30 TMC ల నీటిని నిల్వ చేయవచ్చు కానీ ఎందుకు చేయడం లేదన్నారు.

వరంగల్,నల్గొండ, ఖమ్మం వైపు కాలువలు తవ్వి ఉన్నాయి. నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా చేయటం లేదని ఆరోపించారు. ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదన్నారు. ఎల్లంపల్లి మేడారంకు నీళ్లను తరలించడానికి అవకాశం ఉందన్నారు. వరద వచ్చినప్పుడు నీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి కానీ అలా చేయడం లేదన్నారు. 45 రోజుల నుంచి వరద ద్వారా వస్తున్న నీటిని వృధాగా సముద్రంలోకి వదిలివేస్తున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం నీళ్లకు యూరియా కొరతకు ముడిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరం కూడా తడవలేదని..పెట్టిన ఖర్చు అంత వృధా అయ్యిందన్నారు.ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్నఇన్ ట్రెస్టు ..పాలన మీద లేదన్నారు.

lmd నుండి దిగువకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించవచ్చు…కానీ ఇవ్వడం లేదన్నారు. దీనిపై వరంగల్, ఖమ్మం నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.