ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల ధరల ఖరారు 

V6 Velugu Posted on Jun 23, 2021

కరోనా చికిత్స, వైద్య పరీక్షలు, అంబులెన్సు చార్జీలకు గరిష్ట ధరలను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చార్జీలపై వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబరు 40 జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు.. ఐసీయూ వార్డులో అత్యధికంగా రూ.7,500, వెంటిలేటర్ తో ఉన్నICU గది చికిత్సకు గరిష్టంగా రూ.9 వేలు మాత్రమే ఛార్జ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పీపీఈ కిట్ ధర రూ.273 మించరాదని చెప్పింది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు:
సాధారణ అంబులెన్సుకు కనీస చార్జీ రూ.2 వేలు, హెచ్ఆర్సీటీ-రూ.1,995, డిజిటల్ ఎక్స్‌రే- రూ.1,300, డీ డైమర్ పరీక్ష-రూ.300, సీఆర్పీ-రూ.500, ప్రొకాల్ సిటోనిన్-రూ.1,400, ఫెరిటిన్-రూ.400, ఎల్డీహెచ్‌-రూ.140.

Tagged private hospitals, corona treatment price, government finalized

Latest Videos

Subscribe Now

More News