పాక్ సుప్రీంకు చేరిన అసెంబ్లీ రద్దు అంశం

పాక్ సుప్రీంకు చేరిన అసెంబ్లీ రద్దు అంశం

పాకిస్థాన్లో నెలకొన్న పరిణామాలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇమ్రాన్ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ వ్యవహారంపై స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్ న్యాయమూర్తులందరితో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో నెలకొన్న తాజాగా పరిణామాలపై చర్చించారు. 

జాతీయ అసెంబ్లీ రద్దుపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా చేసి ఇమ్రాన్ ఖాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ ఏక తాటిపై ఉన్నాయని జర్దారీ స్పష్టం చేశారు.