గవర్నర్ ప్రసంగంపై వెనక్కి తగ్గిన కేసీఆర్

గవర్నర్ ప్రసంగంపై వెనక్కి తగ్గిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ బడ్జెట్  ఆమోదించడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను  విత్ డ్రా చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్ ను విమర్శించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.. గవర్నర్ కూడా  తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.  

బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళి సై అనుమతి తెలపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ‘లంచ్ మోషన్’ మెన్షన్ చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వాఖ్య చేసింది. ‘ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుంది’ అని వ్యాఖ్యానించింది.  లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో అందుకు బెంచ్ అంగీకరించింది.