రద్దయిన జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు మరో చాన్స్ ఇస్తున్న సర్కారు

రద్దయిన జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు మరో చాన్స్ ఇస్తున్న సర్కారు
  • పునరుద్ధరణకు జూన్ లోపు వడ్డీ, పెనాల్టీ కట్టాలి

న్యూఢిల్లీ: రిటర్నులు దాఖలు చేయకపోవడంతో రద్దయిన జీఎస్టీ రిజిస్ట్రేషన్​ను వ్యాపార సంస్థలు పునరుద్ధరించుకోవడానికి అనుమతులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి సంబంధిత సంస్థలు బకాయిలు, పన్నులు, వడ్డీ  పెనాల్టీ చెల్లించి  జీఎస్టీ రిజిస్ట్రేషన్​ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.  2022, డిసెంబర్ 31 లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ కోల్పోయిన వ్యాపారాలు తగిన సమయంలో పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోకుంటే ఈ ఏడాది జూన్​లోపు  చేసుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో సవరణలు చేసింది. ఇటువంటి వ్యాపారాలకు క్షమాభిక్ష కల్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది.  రూ. 20 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్​ఎంఈ  పన్ను చెల్లింపుదారులకు వార్షిక రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆలస్యంగా దాఖలు చేయడానికి లేట్​ ఫీజ్​ను కూడా ప్రభుత్వం తగ్గించింది.

ఈ క్షమాభిక్ష పథకాలు డిఫాల్ట్ అయిన పన్ను చెల్లింపుదారులకు మేలు చేస్తాయని, పన్ను వసూళ్లను పెంచుతాయని భావిస్తున్నారు. గడువులోగా జీఎస్టీఆర్​-10 ఫారమ్ లో ఫైనల్​ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించని వాళ్లు రూ.వెయ్యి జరిమానా చెల్లించాలి. ఈ ఏడాది జూన్ 30 నాటికి రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందజేయాలి. తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకున్న పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే తుది రిటర్నును జీఎస్టీఆర్​-10 అంటారు. రూ.20 కోట్ల  వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్​ఎంఈ పన్ను చెల్లింపుదారుల కోసం ఫారమ్ జీఎస్టీఆర్​-9లో వార్షిక రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆలస్యంగా దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారుల నుంచి రోజుకు రూ.50 చొప్పున లేట్​ఫీజ్​ వసూలు చేస్తారు. రూ.5 కోట్ల నుండి రూ. 20 కోట్ల మధ్య మొత్తం టర్నోవర్ ఉంటే రోజుకు రూ. 100 చొప్పున లేట్​ఫీజ్​ను చెల్లించవలసి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు వివరించాయి. పన్ను ఎగవేతదారులకు కోసం క్షమాభిక్ష పథకాలను ప్రకటించడం వల్ల దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని తెలిపాయి.