
అకడమిక్ ఇయర్ ఆగమాగం
ఇప్పటికే టెన్త్, ఇంటర్, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ వాయిదా
ఇంజినీరింగ్ పరీక్షలూ పోస్ట్‌పోన్ అయ్యే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఈ విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో స్కూళ్లు, కాలేజీలకు చాలా రోజులు సెలవులు రాగా, తాజాగా కరోనా ఎఫెక్ట్‌తో మరిన్ని హాలీడేస్ప్రకటించాల్సి వచ్చింది. జూన్‌లో స్టార్టయిన ఎడ్యుకేషన్ ఇయర్ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి. ఇంటర్లాంటి కోర్సులైతే ఓ నెల ముందే ముగుస్తాయి. అయితే గతేడాది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సర్కారు దసరా సెలవులు ప్రకటించింది. కానీ ఆర్టీసీ సమ్మెతో అక్టోబర్ 20 వరకూ పొడిగించాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 31 వరకూ హాలీడేస్అనౌన్స్ చేసింది. ఆ తర్వాత కూడా వైరస్తీవ్రతను బట్టి ఓపెన్ చేయడమా లేదా సెలవులు కంటిన్యూ చేయడమో చేస్తారు.
వాయిదా పడ్డ పలు పరీక్షలు
ఈ నెల19న టెన్త్‌పరీక్షలు స్టార్ట్ కాగా కరోనాతో 3 రోజులకే వాయిదా పడ్డాయి. 23న జరగాల్సిన ఇంటర్ చివరి సబ్జెక్టు పరీక్షలు, 22 నుంచి ఏప్రిల్ 4 వరకూ నిర్వహించాల్సిన అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఎగ్జామ్స్, ఏప్రిల్ 4 నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ సెమిస్టర్స్పరీక్షలు, అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్వాయిదా వేశారు. పనిదినాలు తగ్గడంతో ఏప్రిల్ చివరి వారంలో పెట్టాలనుకున్న ఇంజినీరింగ్పరీక్షలూ పోస్ట్‌పోన్ అయ్యే చాన్స్ఉంది. ఇంటర్స్పాట్ వాల్యుయేషన్కూడా వాయిదా పడింది. ఈ కారణాల వల్ల టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయి.
ప్రమోట్ చేసే చాన్స్
ఒకటి నుంచి 9వ తరగతుల వరకు ఏప్రిల్ 7 నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. ఇవి వాయిదా పడే అవకాశం ఉండడంతో ఆయా క్లాసుల్లోని స్టూడెంట్స్‌ను ప్రమోట్ చేసే ఆలోచనల్లో అధికారులున్నారు. దీనిపై ఈనెల 31న నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల24 నుంచి సమ్మర్ హాలీడేస్ ఉండాలి. కానీ ప్రభుత్వం ఎగ్జామ్స్నిర్వహించేందుకు మొగ్గుచూపితే, ఏప్రిల్ నెలాఖరు వరకూ కొనసాగే అవకాశముంటుంది. సాధారణంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ స్టూడెంట్స్‌కు ఏప్రిల్ చివరివారం నుంచి సెలవులుంటాయి. కానీ ఇప్పుడున్న సెలవుల నేపథ్యంలో వాటిని మే నెలాఖరులో ఇచ్చే చాన్స్ ఉంటుంది.
For More News..