ట్యాంకులో కోతుల ఘటనపై సర్కారు సీరియస్

ట్యాంకులో కోతుల ఘటనపై సర్కారు సీరియస్

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​(నందికొండ) మున్సిపాలిటీలోని వాటర్​ ట్యాంకులోపడి 30 కోతులు మృతి చెందిన ఘటనలో పోలీసులు ..పలువురు అధికారులపై కేసు నమోదు చేశారు. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ఏఈ భిక్షమయ్య, సిబ్బంది వెంకటేశ్వర్లు, నర్సింహాపై జయపురి సౌత్​ పోలీసులు ఐపీసీ సెక్షన్ 269 కింద కేసు రిజిష్టర్​ చేశారు.