హాస్పిటల్ బెడ్ కన్ఫర్మ్ అయితేనే తెలంగాణలోకి అనుమతి

హాస్పిటల్ బెడ్ కన్ఫర్మ్ అయితేనే తెలంగాణలోకి అనుమతి

కోవిడ్ చికిత్స కోసం ఆంధ్రా నుంచి వచ్చే అంబులెన్సులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ పాస్ మరియు పేషంట్‌కు హాస్పిటళ్లో బెడ్ కన్ఫర్మ్ అయితేనే ఎంట్రీ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో తెలంగాణకు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాల బార్డర్‌లో రెవిన్యూ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, పోలీసులు మోహరించారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషంట్ల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటుచేశారు. అయితే పాసులు ఉన్నా కూడా అనుమతించడం లేదని పేషంట్ల బంధువులు వాపోతున్నారు. ఒక పేషంట్‌కి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మ్ అయినా కూడా పంపించడంలేదని అంటున్నారు. సైబరాబాద్ పోలీసు వారిచ్చిన పాస్ కూడా చెల్లదని అంటున్నారని బాధితులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర బార్డర్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, కర్ణాటక బార్డర్‌లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.