21 డేస్ లాక్​ డౌన్..​ కేంద్రం గైడ్ లైన్స్ ఇవే..

21 డేస్ లాక్​ డౌన్..​ కేంద్రం గైడ్ లైన్స్ ఇవే..

న్యూఢిల్లీదేశవ్యాప్తంగా 21 రోజుల పాటు పూర్తిగా లాక్​ డౌన్​ చేస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఏయే ఆఫీసులు, కంపెనీలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుందన్న వివరాలను వెల్లడించింది. వాటిల్లో కూడా వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని, మిగతా వారిని వర్క్​ ఫ్రం హోమ్​ అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఈ రూల్స్​ను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర గైడ్​లైన్స్​ లోని వివరాలు.

  • దేశవ్యాప్తంగా అత్యవసరం కాని కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలను మూసేయాలి. కేవలం రక్షణ, పోలీసు, ట్రెజరీ, విద్యుత్, పెట్రోలియం, ఎల్పీజీ కంపెనీలు, డిజాస్టర్​ మేనేజ్​మెంట్, పోస్టాఫీసులు, ఎర్లీ వార్నింగ్​ ఏజెన్సీలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ అన్ని ప్రభుత్వ సంస్థలను మూసేయాలి. పోలీసులు, ఫైర్, డిజాస్టర్​ మేనేజ్​మెంట్, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, వాటర్, శానిటేషన్ డిపార్ట్​మెంట్లు, మున్సిపాలిటీల్లో శానిటేషన్, వాటర్​ సప్లై ఉద్యోగులు మాత్రం పనిచేయాల్సి ఉంటుంది.
  • ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలోని హాస్పిటళ్లు, మెడికల్​ హాల్స్, అంబులెన్సులు, ఇతర మెడికల్​ఉత్పత్తుల సంస్థలు, ఈ విభాగాలకు సంబంధించిన రవాణా, ఉద్యోగులకు అనుమతి ఉంటుంది.
  • అత్యవసర సర్వీసులు కాని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలను మూసివేయాలి. కూరగాయలు, గ్రోసరీస్, పాలు వంటి ఆహార సంబంధిత నిత్యావసరాల షాపులు, సంస్థలు, కోల్డ్​ స్టోరేజీలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు పనిచేయవచ్చు. అయితే వీలైనంత వరకు హోం డెలివరీకి ప్రయత్నించాలి. ఇక బ్యాంకులు, ఇన్సూరెన్స్​ ఆఫీసులు, ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియా, టెలికం, ఇంటర్నెట్, కేబుల్, ఐటీ సంబంధిత సర్వీసులకు అనుమతి ఉంటుంది.
  • నిత్యావసరాల ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను మాత్రమే తెరిచి ఉంచాలి.
  • నిత్యావసరాల రవాణా తప్ప మిగతా అన్ని రకాల రోడ్డు, రైలు, విమాన రవాణాను నిలిపివేయాలి.
  • అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్​ సెంటర్లూ మూసేయాలి.
  • గుడులు, మసీదులు, ఇతర అన్ని రకాల ప్రార్థనా మందిరాల్లోకి పబ్లిక్​ ను అనుమతించవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలేవీ చేపట్టవద్దు.
  • ఎక్కువ మంది గుమిగూడే అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రం కేవలం 20 మంది వరకే అనుమతి ఉంటుంది.
  • ఫిబ్రవరి 15 తర్వాత విదేశాల నుంచి వచ్చినవాళ్లు హెల్త్​ అధికారులు సూచించినంత కాలం కచ్చితంగా హోం క్వారంటైన్​లో ఉండాలి. లేకుంటే ఐపీసీ సెక్షన్​ 188 కింద కేసు పెడతారు.
  • లాక్​ డౌన్​ నుంచి మినహాయింపు ఉన్న అన్ని డిపార్ట్​మెంట్లు, సంస్థలలో కచ్చితంగా సోషల్​ డిస్టెన్సింగ్​ పాటించాలి.
  • ఈ గైడ్ లైన్స్​ అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

లాక్​డౌన్ తో ఏముంటయి, ఏవి బంద్?

  •     దేశవ్యాప్తంగా అన్నిచోట్లా లాక్​డౌన్​కు ప్రధాని మోడీ ఆదేశం
  •     బుధవారం నుంచి 21 రోజుల పాటు అమలు
  •     అత్యవసర, నిత్యవసర వస్తువులు, సేవలకు మాత్రమే మినహాయింపు
  •     మిగతా అన్ని రకాల ఆఫీసులు, దుకాణాలు బంద్
  •     జనం గుమిగూడే అన్ని రకాల  కార్యక్రమాలపై నిషేధం