
సిద్దిపేట, వెలుగు : బతుకమ్మ పండుగ నిర్వహణ ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తిస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ విశిష్టతను తగ్గిస్తోందన్నారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.