మాటలు తప్ప చేతల్లేవ్..రాష్ట్రంలో టెస్టులు పెంచలే

మాటలు తప్ప చేతల్లేవ్..రాష్ట్రంలో టెస్టులు పెంచలే
  • ట్రేసింగ్ మొత్తం బంద్.. ప్రైమరీ కాంటాక్ట్లను పట్టించుకోవట్లే
  • రోజూ 40 వేల టెస్టులు చేస్తమని సగం కూడా చేస్తలేరు
  •  బులెటిన్లో చెప్తున్నది పదివేల ఆక్సిజన్ బెడ్లు.. ఉన్నవి సగమే
  •  కేంద్రం ఇచ్చిన 1,400 వెంటిలేటర్లను బిగించలే
  •  1,500 బెడ్లతో టిమ్స్‌‌ అన్నరు.. ఇంకా డాక్టర్లు భర్తీ పూర్తికాలేదు
  •  ప్రైవేటు హాస్పిటళ్లలో చార్జీల కంట్రోల్ జీవో ఉత్తదే
  •  ట్రీట్మెంట్ నామ్ కే వాస్తే.. బులెటిన్‌‌లో తప్పుడు లెక్కలు

 

రాష్ట్రంలో కరోనా కట్టడిపై సర్కారు చెప్పిన మాటలకు.. చేస్తున్నదానికి ఏమాత్రం లింకు కుదరడం లేదు. జనాన్ని కాపాడేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నట్టు చెప్తున్న సర్కారు.. పరిస్థితులు ఇంత దారుణంగా మారుతున్నా పట్టించుకోవడం లేదు. కరోనా రాష్ట్రానికి రాదని, వచ్చినా భయపడేది లేదని.. ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. రెండు నెలలుగా కరోనాపై మాటెత్తడమే లేదు. వేల కోట్లు ఖర్చుపెట్టి అయినా కరోనాను కంట్రోల్చేస్తామన్నా.. ఇప్పటివరకు రిలీజ్ చేసింది రూ.200 కోట్లే.

టెస్టులు చేస్తనేలేరు

కరోనా టెస్టులు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచీ దాటవేసే తీరులో వ్యవహరిస్తోంది. రోజూ 40 వేల టెస్టులు చేయాలని ఈనెల 5న కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ అమలు చేయలేదు. ఇప్పటికీ రోజుకు సగటున 18 వేల టెస్టులకు మించడం లేదు. రాష్ట్రవ్యా ప్తంగా 1,092 సెంటర్లలో టెస్టులు చేస్తున్నామని.. పది లక్షల కిట్లు తెప్పిం చామని హెల్త్ డిపార్ట్ మెంట్  బులెటిన్ లో పేర్కొంటోంది. కానీ హైదరాబాద్తో పాటు అన్నిజిల్లాల్లోకూడా వైరస్ లక్షణాలున్నవారు టెస్ట్ చేయించుకునేందుకు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 8 లక్షలు దాటలేదు. ఏపీలో టెస్టుల సంఖ్య 29 లక్షలు దాటింది. టెస్టులు తక్కువగా చేస్తున్నరాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలోనే ఉంది.

వెయ్యి కోట్లు ఏమాయె?

కరోనా కట్టడికి రూ.వెయ్యి కోట్లుఇస్తామని, అవ సరమైతే రూ.5 వేల కోట్లుఖర్చు పెడ్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. కానీ ఇప్పటివర కు రూ.200 కోట్లుమాత్రమే ఇచ్చారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్, మెడిసిన్‌‌‌‌‌‌‌‌కే ఇవి సరిపోతాయని.. ఇతర ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు నిధుల్లేవని అధికారులే చెప్తున్నారు. దీనికితోడు కేంద్రం పంపించిన వెంటిలేటర్లనైనా ఇన్ స్టాల్ చేయకుండా పక్కనపెట్టడం దారుణమని అంటున్నారు.

 బెడ్లు సరిపోవట్లే..

లక్ష మందికైనా ట్రీట్మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేసినమని సర్కారు చెప్పింది. పదివేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని నెల రోజులుగా చెప్తున్నారు. కానీ 4,583 ఆక్సిజన్ బెడ్లు మాత్రమే ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కేంద్రం ఇప్పటికే 1,400 వెంటిలేటర్లను రాష్ట్రానికి పంపింది. కానీ వాటిని ఇప్పటికీ హాస్పిటళ్లలో ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయకపోవటం సర్కారుకున్న శ్రద్ధను చాటుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో 7,862 బెడ్లు మాత్రమే ఉన్నాయి. అవన్నీఫుల్ కావటంతో కొత్తగా వైరస్ సోకిన వాళ్లకు ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధాన హాస్పిటళ్లు అయిన గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్, వరంగల్‌‌‌‌‌‌‌‌లోని ఎంజీఎం పేషెంట్లతో కిట కిటలాడుతున్నాయి. ఎంజీఎంలో ఒక్క బెడ్డు కూడా ఖాళీ లేదని మంగళవారం నాటి బులెటిన్‌‌‌‌‌‌‌‌లో హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. సూర్యాపేట జనరల్ హాస్పిటల్, కొత్తగూడెం, గద్వాల, నాగర్‌ కర్నూల్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు కూడా ఫుల్ అయ్యాయి. గాంధీ, ఉస్మానియా, చెస్ట్‌‌‌‌‌‌‌‌, కింగ్ కోఠి హాస్పిటళ్ళలో డాక్టర్లు, స్టాఫ్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టిమ్స్‌‌‌‌‌‌‌‌లో డాక్టర్లు లేరు చైనా కంటే వేగంగా కట్టినమని గచ్చిబౌలి టిమ్స్‌‌‌‌‌‌‌‌ గురించి సర్కారు గొప్పలు చెప్పుకుంది. అందులో ఇప్పటివరకు డాక్టర్లు కూడా దిక్కులేరు. కాంట్రాక్ట్రి క్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, తక్కువ జీతాలు ఇస్తుండటంతో టిమ్స్, ఇతర సర్కారీ హాస్పిటళ్లలో  పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో మళ్లీ మళ్లీ నోటిఫికేషన్ ఇస్తున్నారు. టీచింగ్ హాస్పిటళలో  జూనియర్ డాక్టర్లను  విపరీతంగా వాడుతుండడంతోపాటు ఇప్పుడు వారికే సీనియర్ రెసిడెంట్లుగా పోస్టింగ్స్ ఇస్తున్నారు.

ట్రేసింగ్ ఎప్పుడో బంద్‌‌

‌‌‌‌‌‌ రాష్ట్రంలో టెస్టులు పెంచకపోగా.. ట్రేసింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా ఆపేశారు. ప్రైమరీ కాంటాక్స్ట్, సెకండరీ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎవరనేది ఎంక్వైరీ చేయడం లేదు. కరోనా కేసులు స్టార్ట్ అయినప్పుడు హెల్త్ డిపార్ట్‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌ , పోలీస్‌‌‌‌‌‌‌‌ , ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌, మున్సి పల్, డిజాస్టర్‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ , రెవెన్యూ వంటి అన్ని శాఖలు కలిసి కట్టుగా పనిచేశా యి. అన్ని శాఖల అధికారులతో టీమ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. టెస్టింగ్ , ట్రేసింగ్‌, ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ , శానిటేషన్‌‌‌‌‌‌‌‌ ఇలా అన్నిచర్యలు చేపట్టేవారు. ఇప్పుడు వైరస్ కట్టడి చర్యలను సర్కారు పూర్తిగా బంద్ పెట్టింది. ఈ డిపార్ట్ మెంట్లన్నింటి నీ కరోనా బాధ్యతల నుంచి తప్పించిం ది. ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలని మౌఖికంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.

ఇన్‌‌‌‌‌‌‌‌ పేషెంట్ల లెక్కలూ తప్పే

కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్ల పేర్లు, పేషెంట్ల సంఖ్యను బులెటిన్‌‌‌‌‌‌‌‌లో ప్రకటిస్తున్నారు. కానీ చాలా హస్పిటళ్లలో పేషెంట్ల సంఖ్యను యాడ్ చేయడం లేదు. మంగళవారం ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సుమారు 50 మంది, కరీంనగర్‌లోని చల్మెడ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సుమారు 76 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కామినేని, మల్లారెడ్డి సహా పలు టీచింగ్ హాస్పిటళ్లలోనూ పేషెంట్లు ఉన్నారు. కానీ ఈ లెక్కలేవీ బులెటిన్‌‌‌‌‌‌‌‌లో లేవు. అంటే సర్కారు చెప్తున్న ఇన్‌ ‌‌‌‌‌‌‌పేషెంట్ల లెక్కలన్నీ అబద్ధమేనని స్పష్టంగా తెలుస్తోంది.

టీచింగ్ హాస్పిటళ్లలో ఫ్రీ ట్రీట్మెంట్ ఏమాయె?

ప్రైవేట్ టీచింగ్ హా స్పిటళ్లలో కరోనా పేషెంట్లకు ఫ్రీగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తామని సర్కారు మూడు నెలల నుంచీ చెప్తోంది. ఇప్పటివరకు ఒక్క పేషెంట్‌‌‌‌‌‌‌‌కు కూడా టీచింగ్ హాస్పిటళ్లలో ఉచితంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందించలేదు. ఆ హాస్పిటళలోని బెడ్లు తమ ఆధీనంలోనే ఉన్నట్టు సర్కారు రోజూ ఇచ్చే బులెటిన్లో చెప్పు కుంటోంది. కానీ కార్పొరేట్ హాస్పిటళ్లలాగే.. టీచింగ్ హాస్పిటళ్లు అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నయి. అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గా కనీసం రూ.లక్ష కడితేనే పేషెంట్లను చేర్చు కుంటున్నాయి.

 అమలుకాని సర్కారు ప్యాకేజీ ప్రైవేట్ హాస్పిటళ్లు

కరోనా పేషెంట్లను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. సర్కారు ప్రకటించిన ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్యాకేజీలను ఒక్క హాస్పిటల్ కూడా అమలు చేయడం లేదు. ఐసోలేషన్ బెడ్‌‌‌‌‌‌‌‌కు రూ.4 వేలు, ఐసీయూకు రూ.7,500, వెంటిలేటర్ పెడితే రోజుకు రూ. 9 వేలు మాత్రమే చార్జ్‌‌‌‌‌‌‌‌ చేయాలంటూ జూన్‌‌‌‌‌‌‌‌15న సర్కారు జీవో ఇచ్చింది. కానీ ప్రైవేటు హాస్పిటళ్లు ఆ జీవోను పట్టించుకోనే లేదు. రోజుకు లక్ష రూపాయలకు పైగా బిల్లులు వేస్తున్నాయి. కనీసం లక్షా, రెండు లక్షలు ముందుగా కడితేనే పేషెంట్లను అడ్మిట్ చేసుకుంటున్నాయి. హెల్త్ ఇన్సురెన్స్ కార్డులున్నా చెల్లవని చెప్తున్నాయి. ప్రైవేటు దోపిడీపై పేషెంట్ల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. అయినా కేవలం రెండు హాస్పిటళ్లపై మాత్రం నామ మాత్రపు చర్యలు తీసుకున్న సర్కారు.. చివరికి బతిమిలాడే ధోరణి ప్రదర్శించింది. సగం బెడ్లకు సర్కారు ప్యాకేజీ ఇచ్చి.. మిగతా సగం బెడ్లలో ఇష్టమొచ్చినట్టువసూలు చేసుకునేందుకు పరోక్షంగా పర్మిషన్ ఇచ్చింది.