శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్

శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్

శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్. యాత్రికుల కోసం  అక్కడి పోలీస్ శాఖ, దేవస్థానం బోర్డ్  ఆధ్వర్యంలో ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్‌లను, స్వామివారి ప్రసాదాలను  బుక్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాల దర్శనాలను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్‌ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవచ్చు. భక్తులు వారి వ్యక్తిగత సమాచారం, వయస్సు, అడ్రస్, ఆధార్‌ కార్డ్‌, ఫొటో గుర్తింపు కార్డులను  ఇవ్వాల్సి ఉంటుంది. బుకింగ్‌  చేసుకున్న తర్వాత  ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంఎస్‌ ద్వారా దర్శనం తేదీ, సమయం, స్లాట్‌ వివరాలను ఈ-మెయిల్‌లో పంపిస్తారు. తర్వాత  బార్‌కోడ్‌ ఉన్న టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ టికెట్‌ను, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉపయోగించిన ఫొటో గుర్తింపు కార్డును యాత్రికులు దర్శనానికి వెళ్లేటప్పుడు తమ వెంట కచ్చితంగా తీసుకువెళ్లాలి. యాత్రికులు  (http.//sabirimalaonline.org) పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.