
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వార్తా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీచేసింది. సైరన్ శబ్దాలను వెంటనే ఉపయోగించకుండా ఉండాలని కేంద్రం అన్ని వార్తా ఛానెల్‌లను ఆదేశించింది. ఇది వాస్తవ హెచ్చరికలను డీసెన్సిటైజ్ చేస్తుందని చెబుతోంది.
టీవీ కార్యక్రమాలలో వైమానిక దాడి సైరన్ శబ్దాలను ఉపయోగించడం వెంటనే నిలిపివేయాలని భారత ప్రభుత్వం వార్తా ఛానెళ్లను ఆదేశించింది. నిజమైన వైమానిక దాడి సైరన్లు, అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన హెచ్చరికలను కోల్పోకుండా ఉండేందుకే టీవీల్లో అలాంటి సైరన్ శబ్దాలను వినియోగం నిషేధించినట్లు తెలిపింది.
టీవీఛానెళ్లు ఎట్టి పరిస్థితుల్లో డిఫెన్స్ ఎయిర్ రైడ్ సైరన్లను వినియోగించవద్దని మీడియా ఛానెళ్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ హోమ్ గార్డ్స్ ఆదేశించింది. దీనివల్ల వాస్తవ అత్యవసర హెచ్చరికలను ప్రజలు విస్మరించవచ్చని హెచ్చరించింది.
►ALSO READ | పహల్గామ్ కుట్ర ప్లాన్ 2 నెలల ముందే జరిగిందా..? బయటపెట్టిన అమెరికా సంస్థ