గుడ్ న్యూస్: దేశంలో 12 కొత్త ఎయిర్ పోర్టులు

గుడ్ న్యూస్: దేశంలో 12 కొత్త ఎయిర్ పోర్టులు

దేశంలో అదనంగా 12 కొత్త ఎయిర్ పోర్టులను నిర్మిస్తుంది. UDAN పళకంతో భాగంగా ఈ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎయిర్ పోర్టులు  ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఈ ఎయిర్ పోర్టుల అందుబాటులోకి వస్తే ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపింది. 

ప్రస్తుతం దేశంలో మొత్తం 85 ఎయిర్ పోర్టులున్నాయి. వీటి ద్వారా 579 రూట్లలో విమానాలు నడుస్తు్నాయి. ఈ ఎయిర్ పోర్టుల్లో 13 హెలీ ప్యాడ్స్, 2 వాటర్ ఎయిరోడ్రోమ్స్ ఉన్నాయి. 2016 నుంచి ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (UDAN) పథకంలో భాగంగా నిర్వహిస్తున్నారు. దేశంలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై సోమవారం జూలై 29,2024న లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహల్. ఉడాన్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు, ఎప్పటికప్పుడు బిడ్డింగ్ ప్రక్రియను జరుపుతూ కొత్త ఎయిర్ పోర్టులు, రూట్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న ఎయిర్ పోర్టులను కూడి ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. 

2024లో కొత్తగా వచ్చే 12 ఎయిర్ పోర్టులను ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్ లోని రేవా, దాతియా, మహారాష్ట్రలోని అమరావతి, సోలాపూర్, డామన్ డయ్యూలోని డామన్, హర్యానాలోని అంబాలా, యూపీలోని మొరదాబాద్, శహరాన్పూర్, తమినళనాడులోని వెల్లూర్, నైవేలీ, అండమాన్ నికోబార్ లోని శివపూర్, కార్ నికోబార్ లతో ప్రారంభించనున్నట్లు విమానయాన మంత్రి చెప్పారు. మరోవైపు ఆల్ రెడీ ఉన్న ఎయిర్‌పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో 4వేల 500 కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.1,000 కోట్లు కేటాయించారు.