- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ముషీరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో సౌలతులు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచాలే తప్ప తగ్గించొద్దన్నారు. పనులు ఆగిపోయిన ముషీరాబాద్ సర్కారు బడిని ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు.
నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి, టీచర్పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యలపై జూన్, జులై, ఆగస్టు మాసంలో సర్వే చేసి, నివేదికను అధికారులకు అందిస్తామన్నారు. నాయకులు అశోక్ రెడ్డి, ఎం.వెంకటేశ్, దశరథ్, ఆర్.వెంకటేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
