
భైంసా, వెలుగు: 12 ఏండ్ల కింద మూతబడిన గవర్నమెంట్ స్కూల్ ఎట్టకేలకు తెరుచుకుంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం బాబుల్గావ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 12 ఏండ్ల కింద మూతపడింది. ఏళ్లుగా గ్రామంలో స్కూల్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. విషయాన్ని గ్రామస్తులు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా అధికారులతో మాట్లాడి స్కూల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు.
మంగళవారం స్కూల్‌ను పున: ప్రారంభించి, విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. స్కూల్‌కు ఒక టీచర్‌ను కేటాయించగా, 20 మంది పిల్లలు అడ్మిషన్తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టూడెంట్లు, పేరెంట్స్ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని స్కూల్‌ను పున: ప్రారంభించామని తెలిపారు. పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈవో రామారావు, ఎంఈవో సుభాష్ కోరారు.