సర్కార్ బడులపై ప్రభుత్వం చిన్నచూపు ..ఆమ్ ఆద్మీ తెలంగాణ ఇన్చార్జి ప్రియాంక కక్కర్

సర్కార్ బడులపై ప్రభుత్వం చిన్నచూపు ..ఆమ్ ఆద్మీ తెలంగాణ ఇన్చార్జి ప్రియాంక కక్కర్

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో సర్కార్​ బడుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ ఇన్​చార్జి ప్రియాంక కక్కర్ అన్నారు. బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో శనివారం డాక్టర్ దిడ్డి సుధాకర్ తో కలిసి ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ కొనసాగిస్తున్న దోపిడీ విధానాలనే, తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, పౌష్ఠికాహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.