
ఆర్టీసీ సమ్మెపై సీరియస్ గా ఫోకస్ చేసింది ప్రభుత్వం. కార్మిక సంఘాల జేఏసీ వెనక్కి తగ్గకపోవటంతో… ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు సీఎం కేసీఆర్.
బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో జరగనున్న భేటీలో రవాణా, ఆర్టీవోతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. సమావేశంలో ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.