
సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు కాంగ్రెస్ నేత రాములు నాయక్. కేసీఆర్ శ్రీలంక బౌలర్ మలింగ లాంటివాడన్నారు. లాకౌ డౌన్ సమయంలో కేసీఆర్… ప్రధాని మోడీతో పోటీపడి లాక్ డౌన్ రోజులు పెంచారన్నారు. ప్రధాని మోడీ కంటే తెలివైన వాడినని అకుంటుంటాని…అంతేకాదు ఏదో ఒక రోజు ప్రధానిని అవుతాని పగటికల కంటున్నారన్నారు. ప్రపంచంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూనే … కేసీఆర్ దరిద్రపు రాష్ట్రం చేశారని ఆరోపించారు.1200 మంది విద్యార్థుల బలిదానంతో కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. ఓయూ లో విద్యార్థి జేఏసీ కన్వినర్ రవిందర్ నాయక్ నిరుద్యోగంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు రాములు నాయక్ . తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అనుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ కు మనసుంటే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని… CMRF నుంచి కోటి రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు రాములు నాయక్.