కొత్తగా ఎన్నికైన రాష్ట్ర వీడియో జర్నలిస్టు అసోసియేషన్ మంగళవారం సెక్రటేరియేట్లో ఐ అండ్పీఆర్మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. అక్రిడిటేషన్స్విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. కొత్త కమిషనర్ వచ్చారని, వీడియో జర్నలిస్టులకు అన్ని రంగాలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ నండూరి హరీశ్, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ సన్నీ, జాయింట్ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ విజయ్ ఉన్నారు.

