కోనరావుపేట,వెలుగు: కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం రామన్నపేట సర్పంచ్ కంది లక్ష్మి రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా విప్ వారికి కండువా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే మామిడిపల్లి సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, వెంకట్రావుపేటకు చెందిన బీఎస్పీ మండల అధ్యక్షుడు కుమ్మరి దేవదాస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా సమక్షంలో పార్టీలో చేరగా వారికీ ఆది శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రజా పాలనను కోరుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కొత్త సర్పంచులు ప్రజాసేవకు అంకితమై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య, నాగారం సర్పంచ్ నాగభూషణం, భాస్కరరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
